Logo Ekvastra

Geet, Subhashita, AmrutVachan and Bodhkatha

User Tools


geet:ee_desam_manadira

ఈదేశం మనదిరా

ఈదేశం మనదిరా ఈసంస్కృతి మనదిరా
ఈధర్మం మనదిరా మన చరిత్ర మరువకురా

శ్రీరాముని మహిత కథ వేదసార దివ్య సుధ
విలువ నేర్పి నీతి పంచి లోకహితం కూర్చెరా
శ్రీ శంకర రామానుజ భౌద్ధ జైన దర్శనాలు
విశ్వశాంతి కోరి మనకు జగద్గురుత నొసగెనురా

ఝాన్సీ రుద్రమదేవి టంగుటూరి నేతాజీ
బానిసత్వ విషవలయం త్రుంచు విధం నేర్పెరా
భగత్ సింగ్ ఆజాద్ విప్లవాగ్ని అల్లూరీ
చిరునవ్వుతొ బలిదానం చేయు విధం చూపెరా

ఈధర్మం ఈసంస్కృతి నరనరాన నింపరా
మాతృదేశ వైభవం దశదిశలా చాటరా
తల్లి ఋణం తీర్చుటకై తరలిరమ్ము సోదరా
మాతృభూమి రక్షణకై చేయిచేయి కలిపిరా

IAST transliteration

īdeśaṃ manadirā īsaṃskṛti manadirā
īdharmaṃ manadirā mana caritra maruvakurā

śrīrāmuni mahita katha vedasāra divya sudha
viluva nerpi nīti paṃci lokahitaṃ kūrcrā
śrī śaṃkara rāmānuja bhauddha jaina darśanālu
viśvaśāṃti kori manaku jagadguruta nsagnurā

jhānsī rudramadevi ṭaṃguṭūri netājī
bānisatva viṣavalayaṃ truṃcu vidhaṃ nerprā
bhagat siṃg ājād viplavāgni allūrī
cirunavvut balidānaṃ ceyu vidhaṃ cūprā

īdharmaṃ īsaṃskṛti naranarāna niṃparā
mātṛdeśa vaibhavaṃ daśadiśalā cāṭarā
talli ṛṇaṃ tīrcuṭakai taralirammu sodarā
mātṛbhūmi rakṣaṇakai ceyiceyi kalipirā