Logo Ekvastra

Geet, Subhashita, AmrutVachan and Bodhkatha

User Tools


geet:karya_rangme_kada

కార్యరంగమే కదా

కార్యరంగమే కదా - మనకు భువిన స్వర్గము
దేశమాత వైభవమే - జీవన సంకల్పము

ఆటపాట సాధనగా - సేవే ఆరాధనగా
అందరమొకటవ్వగా - హిందు హిందు సింధువుగా
సంఘటనా మంత్రముతో - శక్తిని దర్శించగా
ధర్మ సంశయం తొలగి - కర్మ జ్యోతి వెలుగగా || కార్య ||

సంకటము, కంటకమౌ - దారుల ఎదురేగుదాము
సుఖమైనా, దుఃఖమైన - సమభావం చూపుదాము
స్వార్థపు పొరలన్ని చీల్చి - పరమార్థం రూపు దాల్చి
పరమ వైభవం పథమున - సర్వస్వం అర్పించగ || కార్య ||

హిందుత్వం నరనరాన - బంధుత్వం ఈ జగాన
సారస్వత వీర గుణం - సంస్కారం కణకణాన
త్యాగాల పునాదులదీ- తరతరాల మన చరిత్ర
విశ్వగురువు భరతమాత - వినిపించగ దివ్య గీత || కార్య ||

IAST transliteration

Kārya raṅgamē kadā - manaku bhuvina svargamu
dēśamāta vaibhavamē - jīvana saṅkalpamu

aṭa pāṭa sādhanagā - sēvē ārādhanagā
andaram okaṭavvagā - hindu hindu sindhuvugā
saṅghaṭanā mantramutō - śaktini darśin̄chagā
dharma sanśayaṁ tolagi - karma jyōti velugagā || kārya ||

saṅkaṭamu, kaṇṭakamau - dārula edurēgudāmu
sukhamainā, duḥkhamaina - samabhāvaṁ chūpudāmu
Svārthapu poralanni cheelchi - paramārthaṁ rūpu dālchi
paramavaibhavam pathamuna - sarvasvaṁ arpin̄chaga || kārya ||

hindutvaṁ naranarāna - bandhutvaṁ ī jagāna
sārasvata vīra guṇaṁ - sanskāraṁ kaṇakaṇāna
Tyāgāla punāduladī - taratarāla mana charitra
viśvaguruvu bharatamāta - vinipin̄chaga divya gīta || kārya ||

Audio