Logo Ekvastra

Geet, Subhashita, AmrutVachan and Bodhkatha

User Tools


geet:karyakarta_sadhanam

kāryakarta sādhanaṃ

కార్యకర్త సాధనం - ధ్యేయ పూర్తి కంకితం
తనకు తానే దీపమై - మాతృ భూమికర్పితం

నర నరాన నా దేశపు పూర్వజులే ప్రేరణ
నలువైపుల సంఘ కార్య విస్తరణే సాధన
అహంకార రహితమైన ఆత్మార్పణ జీవనం
నిర్ మమత్వ భావన మనదీశ్వరీయ కార్యము

హిందు రాష్ట్ర సిద్దాంతం సత్యం,సనాతనం
కఠినమైన లక్ష్యమ్మిది ,విజయం సునిశ్చయం
సరళమైన,సహజమైన సంఘ శాఖ మన బలం
స్థిర చిత్తంతో నిరతం పని చేస్తేనే ఫలితం

ప్రలోభాలు,భయాలకు విచలితులం కావద్దు
ప్రతి బద్దత,విశ్వాసం జార విడుచుకోవద్దు
మధురమైన మాటలతో,ఆదర్శపు చేతలతో
వ్యక్తి వ్యక్తి నిర్మాణం - సంఘటనకు మూల బలం

IAST transliteration

kāryakarta sādhanaṃ - dhyeya pūrti kaṃkitaṃ
tanaku tāne dīpamai - mātṛ bhūmikarpitaṃ

nara narāna nā deśapu pūrvajule preraṇa
naluvaipula saṃgha kārya vistaraṇe sādhana
ahaṃkāra rahitamaina ātmārpaṇa jīvanaṃ
nir mamatva bhāvana manadīśvarīya kāryamu

hiṃdu rāṣṭra siddāṃtaṃ satyaṃ,sanātanaṃ
kaṭhinamaina lakṣyammidi ,vijayaṃ suniścayaṃ
saraḻamaina,sahajamaina saṃgha śākha mana balaṃ
sthira cittaṃto nirataṃ pani cestene phalitaṃ

pralobhālu,bhayālaku vicalitulaṃ kāvaddu
prati baddata,viśvāsaṃ jāra viḍucukovaddu
madhuramaina māṭalato,ādarśapu cetalato
vyakti vyakti nirmāṇaṃ - saṃghaṭanaku mūla balaṃ