రమ్ము రమ్ము
రమ్ము రమ్ము భరతవీర రాష్ట్ర రక్షణమ్ము చేయ
శత్రుమూక దునిమి నీవు క్షాత్ర తేజమొలికించుము
అరివీరుల దునిమాడెడి ఆ పురుషోత్తముని జూచి
అధిగమించు శత్రుసేన హతమును కళ్ళార చూడ ||రమ్ము రమ్ము||
ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు
రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు ||రమ్ము రమ్ము||
జాతి శౌర్యముట్టిపడగ జనుల వీపు తట్టి లేపి
శత్రు గుండె చీల్చునట్టి ఛత్రపతిని వేగ చూడు ||రమ్ము రమ్ము||
విప్లవాగ్ని జ్వాలలనిట విను వీధుల కెగయ జేయ
వీరుడైన సావర్కర్ వీర గీతికలను పాడు ||రమ్ము రమ్ము||
భగత్ సింగ్ ఆజాదుల వీరగతిని గాన్చినావ
మొక్కవోని వారి శౌర్య మెక్కడిదొ చూడ రమ్ము ||రమ్ము రమ్ము||
డాక్టర్ హెడ్గేవార్జీ పరమ పూజ్య గురూజీ
మరిఎందరొ త్యాగధనుల దారులు ఏర్పరుప చూడ ||రమ్ము రమ్ము||
IAST transliteration
rammu rammu bharatavīra rāṣṭra rakṣaṇammu ceya
śatrumūka dunimi nīvu kṣātra tejamlikiṃcumu
arivīrula dunimāḍḍi ā puruṣottamuni jūci
adhigamiṃcu śatrusena hatamunu kaḻḻāra cūḍa ||rammu rammu||
ఒka caṃkana biḍḍa cūḍu ఒka vaṃkana khaḍgamāḍu
raṇamuna rayamuna vḻḻe hayamuna jhānsīni cūḍu ||rammu rammu||
jāti śauryamuṭṭipaḍaga janula vīpu taṭṭi lepi
śatru guṃḍ cīlcunaṭṭi chatrapatini vega cūḍu ||rammu rammu||
viplavāgni jvālalaniṭa vinu vīdhula kgaya jeya
vīruḍaina sāvarkar vīra gītikalanu pāḍu ||rammu rammu||
bhagat siṃg ājādula vīragatini gāncināva
mkkavoni vāri śaurya mkkaḍid cūḍa rammu ||rammu rammu||
ḍākṭar hḍgevārjī parama pūjya gurūjī
mariఎṃdar tyāgadhanula dārulu erparupa cūḍa ||rammu rammu||
