Logo Ekvastra

Geet, Subhashita, AmrutVachan and Bodhkatha

User Tools


geet:vikraminchumuhaindava

విక్రమించుము హైందవా

విక్రమించుము హైందవా పరాక్రమించుమురా
ఉదాసీనత కట్టిపెట్టి ఉద్యమించుమురా, ఉపక్రమించుమురా

బలమే జీవనమన్ననానుడి సత్యసిద్ధం శాశ్వతం
సాత్వికత నిండిన బలమ్మే సర్వకాల శుభప్రదం
మానవీయత ముసుగులోపలి దానవుల కనిపెట్టరా
విజయశ్రీ చేపట్టరా భళి వీరభద్రుడవై, వీరభద్రుడవై ।

యుగము మారే జగమ్ముమారె గ్రహాల గమనం మారెనా
శ్రేష్ఠ హిందూచింతనం చిరంతనం ఇది మారునా
సమరశీల జనాళి హృదిలో సామరస్యము నింపరా
సర్వజన కళ్యాణమనయగ రామచంద్రుడవై శ్రీరామచంద్రుడవై ।

జీవితానికి హాయిగొలిపే జిలుగు వెలుగుల సాధనాలు
ఆధునీకత పరుగులో అవి ఆత్మనాశక అంకురాలు
వివేకముతో మెలగరా నీ విజ్ఞతను కోల్పోకురా
శిష్టరక్షణ చేయరారా నరసింహదేవుడవై,నరసింహదేవుడవై ।

IAST transliteration

vikraminchumu haindavā parākraminchumurā
udāsīnata kaṭṭipeṭṭi udyaminchumurā, upakraminchumurā

balame jīvanamannanānuḍi satyasiddhaṃ śāśvataṃ
sātvikata niṃḍina balamme sarvakāla śubhapradaṃ
mānavīyata musugulopali dānavula kanipaెṭṭarā
vijayaśrī cepaṭṭarā bhaḻi vīrabhadruḍavai, vīrabhadruḍavai ।

yugamu māre jagammumāraె grahāla gamanaṃ māraెnā
śreṣṭha hiṃdūciṃtanaṃ ciraṃtanaṃ idi mārunā
samaraśīla janāḻi hṛdilo sāmarasyamu niṃparā
sarvajana kaḻyāṇamanayaga rāmacaṃdruḍavai śrīrāmacaṃdruḍavai ।

jīvitāniki hāyigaొlipe jilugu vaెlugula sādhanālu
ādhunīkata parugulo avi ātmanāśaka aṃkurālu
vivekamuto maెlagarā nī vijñatanu kolpokurā
śiṣṭarakṣaṇa ceyarārā narasiṃhadevuḍavai,narasiṃhadevuḍavai ।